Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పని ఒత్తిడి... భోజనం వేళ ప్రకారం చేస్తున్నారా లేదా...?

పని ఒత్తిడి కారణంగా నిర్ణీత వేళకు భోజనం చేయరు. ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి మనమూ తెలుసుకుందాం. ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపుల

పని ఒత్తిడి... భోజనం వేళ ప్రకారం చేస్తున్నారా లేదా...?
, గురువారం, 23 మార్చి 2017 (21:51 IST)
పని ఒత్తిడి కారణంగా నిర్ణీత వేళకు భోజనం చేయరు. ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి మనమూ తెలుసుకుందాం. ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ (అసిడిటి) సమస్య పెరిగి, శరీర పటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెపుతున్నారు. 
 
అంతేకాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనోరెక్సియా వ్యాధి సోకితే వ్యక్తి తన సాధారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుందని చెపుతున్నారు. ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళలో రుతుక్రమానికి (పీరియడ్స్‌) సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
బలీమియా, బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది. కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది.
 
కొందరు యువతీయువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యు హెచ్చరిస్తున్నారు. ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి కడుపు నిండా భోంచేసి ఆరోగ్యాంగా ఉండండని సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబోయ్ మొండి చుండ్రు... తల జిల... చాలా బాగోదు, ఏం చేయాలి?