Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Advertiesment
red wine

ఠాగూర్

, సోమవారం, 24 మార్చి 2025 (17:41 IST)
ఇటీవలికాలంలో మహిళల్లో కేన్సర్ ముప్పు పెరిగిపోతుంది. ముఖ్యంగా వైన్ తీసుకునే మహిళల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైట్ వైన్ కారణంగా మహిళల్లో ఈ ముప్పు పెరుగుతున్నట్టు అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
ఈ తాజా అధ్యయనం మేరకు.. రెడ్ వైన్ ఆరోగ్యకరమనే వాదనకు ఎలాంటి ఆధారం లభించలేదు. రెడ్ వైన్‌లోని రైస్ వెరట్రాల్ సహా ఇతరాత్రా యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యానికి మేలు చేస్తాయనే అభిప్రాయం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ యాంటీ ఆక్సిడెంట్లతో మేలు జరుగుతుందని, కేన్సర్ ముప్పు తగ్గుతోందని కానీ చెప్పలేమన్నారు. తమ పరిశోధనలో గట్టి ఆధారాలు ఏవీ లభించలేదన్నారు. 
 
ఇప్పటివరకు జరిగిన 42 అధ్యయనాల్లో వెల్లడైన డేటాను నిశితంగా పరిశీలించాక ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యున్‌యంగ్ చో పేర్కొన్నారు. అదేసమయంలో వైట్ వైన్ వల్ల మహిళల్లో కేన్సర్ ముప్పు పెరుగుతోందని గుర్తించినట్టు తెలిపారు. 
 
వైట్ వైన్ తరచుగా తాగే మహిళల్లో చర్మ కేన్సర్ ముప్పు 22 శాతం పెరుగుతోందన్నారు. కాగా, రోజువారీ జీవితంలో సూర్యకాంతికి ఎక్కువగా గురికావడం సహా ఇతరాత్రా అలవాట్లు కూడా ఈ ముప్పు పెరగడానికి కారణం కావచ్చని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?