ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి చదవాల్సిన ముఖ్యమైన సమాచారం..

ఆడపిల్లల పెళ్ళిళ్ల కోసం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు మనదేశంలో చాలామందే ఉన్నారు. అయితే ఈ పథకం గురించి తెలిస్తే ఇక ఆడపిల్లల పెళ్ళి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రప్రభుత్వం ఒక ఆర్థిక భరోసాను కల్పించింది. కేంద్

శుక్రవారం, 10 నవంబరు 2017 (18:17 IST)
ఆడపిల్లల పెళ్ళిళ్ల కోసం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు మనదేశంలో చాలామందే ఉన్నారు. అయితే ఈ పథకం గురించి తెలిస్తే ఇక ఆడపిల్లల పెళ్ళి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రప్రభుత్వం ఒక ఆర్థిక భరోసాను కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించిన పథకం సుకన్య సమృద్థి యోజనా పథకం. ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే మీ ఇంట్లో పది సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఉండాలి.
 
ఈ స్కీంలో నెలకు కొంత డబ్బును జమ చేస్తే మీ పాప చదువు లేదా పెళ్ళి వరకు దానికి నాలుగు రెట్ల డబ్బును పొందవచ్చు. అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెలా డబ్బులు వేయాలి. అమ్మాయి జన్మించినప్పటి నుంచి పది సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఈ పథకంలో చేరచ్చు. స్థానిక తపాలా కార్యాలయం, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఖాతాలో తల్లి లేదా తండ్రి సంతకం చేయవచ్చు.
 
ఒకరికి ఒక్క అకౌంట్ మాత్రమే. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇద్దరికి వేర్వేరుగా అకౌంట్‌లు ఓపెన్ చేయవచ్చు. తల్లిదండ్రుల గుర్తింపు పత్రం, పిల్లల జనన ధృవీకరణ పత్రంతో ఖాతాను ప్రారంభించవచ్చు. మొదటగా మీరు అకౌంట్లో వేయాల్సింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా లక్షా 50 వేలు పొదుపు చేయవచ్చు. నెలకు ఒకసారి, సంవత్సరంలో ఎప్పుడైనా ఖాతాలో జమ చేయవచ్చు. 
 
ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 14 సంవత్సరాల వరకు ఇలా చేయాలి. ఆ తరువాత అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 సంవత్సరాల తరువాత మిగిలిన మొత్తం ఇచ్చేస్తారు. ఈ పథకం కింద ఉన్న నగదును ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు సంవత్సరం.. సంవత్సరం మారుతూ ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కస్తూరి పసుపులో వున్న మేలెంత? (video)