Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడపిల్ల వద్దనుకుంటున్నవారి కోసం ఈ కథనం.. చదవండి...

అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున! అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి శర్మ ఎంతగనో ఆనందించాడు. పిల్లవాడు,

Advertiesment
girl child
, శుక్రవారం, 3 మార్చి 2017 (13:45 IST)
అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున! 
అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి శర్మ ఎంతగనో ఆనందించాడు. పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. 
పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాలసివస్తుంది. 
అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడంతో కాదనలేకపోయాడు. 
వరుని తరపువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. 
కొద్దిసేపు వచ్చిన పని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది. శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.
అయితే మగపెళ్ళివారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.
మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాల కులపొడి వేశారు.
మా ఇంటిపధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.
మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.
వెంటనే ఏం బయలు దేరుతారు, 
కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు. అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది. కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.
బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు... 'నేను ఏం తింటాను, ఎలా తాగుతాను, నా ఆరోగ్యానికి ఏది మంచిది.. ఇవన్నీ మీకెలాతెలుసు?' అని.
అమ్మాయి అత్తగారు ఇలా అంది.... 'నిన్నరాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది. మానాన్నగారు మొహమాట పడతారు. వారిగురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలనికోరింది.' 
శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.
శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు... 'లలితా, మా అమ్మ చనిపోలేదు.'
'ఏవిటండీ మీరు మాటాడుతున్నది'
'అవును లలితా, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికే ఉంది.. నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్ళతో. 
దీన్ని చదివిన తరువాతన్నా ఆడపిల్లలు ఎంత ముఖ్యమో అర్థమైందా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్చీకి అతుక్కుపోయి పని చేయండి.. టపా కట్టేందుకు అదే సరైన మార్గం