Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుర్చీకి అతుక్కుపోయి పని చేయండి.. టపా కట్టేందుకు అదే సరైన మార్గం

గంటలు గంటలు కుర్చీల్లో జారగిలపడి పని చేయడమే లోకంగా బతుకుతున్నారా? ఆఫీసు నుంచి ఇంటికి రాగానే మళ్లీ కుర్చీలో కూర్చుని టీవీ ముందు గంటల పాటు గడుపుతున్నారా? మీ ఊబకాయానికి, మీ గుండెనొప్పులకు ఇంతకు మించిన కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబ

కుర్చీకి అతుక్కుపోయి పని చేయండి.. టపా కట్టేందుకు అదే సరైన మార్గం
హైదరాబాద్ , శుక్రవారం, 3 మార్చి 2017 (06:28 IST)
గంటలు గంటలు కుర్చీల్లో జారగిలపడి పని చేయడమే లోకంగా బతుకుతున్నారా? ఆఫీసు నుంచి ఇంటికి రాగానే మళ్లీ కుర్చీలో కూర్చుని టీవీ ముందు గంటల పాటు గడుపుతున్నారా? మీ ఊబకాయానికి, మీ గుండెనొప్పులకు ఇంతకు మించిన కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక సమయం కూర్చొని పనిచేసే డెస్క్‌ ఆధారిత ఉద్యోగాలతో గుండె జబ్బులతో పాటు, నడుము చుట్టుకొలత పెరిగే ముప్పు ఉందని మరోసారి వెల్లడైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
 
రోజులో ఐదు పనిగంటల తరువాత కూర్చొని పనిచేసే ప్రతి అదనపు గంట వల్ల నడుము చుట్టుకొలత రెండు సెంటిమీటర్లు, గుండె జబ్బులు వచ్చే అవకాశం 0.2 శాతం పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే రోజుకు ఐదు పనిగంటల తరువాత ప్రతి అదనపు గంట పనివల్ల చెడు కొవ్వు పెరిగి, మంచి కొవ్వు తగ్గుతోందని వెల్లడించారు. రోజుకు ఏడు గంటలు నిల్చోవడం, ఏడు మైళ్లు నడవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేయొచ్చని సూచించారు.
 
'మానవ జాతిగా ఎదిగే క్రమంలో మనం రోజంతా కూర్చొని ఉండేలా మన శరీర నిర్మాణం జరగలేదు. వేటగాళ్లు, చెత్తసేకరణ కార్మికుల మాదిరిగా రోజుకు 7-8 గంటలు కాళ్లకు పనిచెబితేనే ఆరోగ్యంగా ఉంటామనే ఆలోచన సరళికి అలవాటు పడ్డాం' అని ప్రొఫెసర్‌ మైక్‌ లీన్‌ అన్నారు. తీరా చూస్తుంటే మన పూర్వీకులకు చెందిన ప్రాథమిక లక్షణాలకు కూడా మనం దూరమైపోయినట్లే ఉంది కదా. అయితే తస్మాత్ జాగ్రత్త.
 
కూర్చుని చేసే పని అయినా సరే ప్రతి అరగంట లేక గంటకు ఒకసారి టాయెలెట్ వరకూ నడిచి, కళ్లను నీటితో తుడుచుకోవడం చేయకపోతే ముప్పుతప్పదని ఏనాడో వైద్యశాస్త్రం చెప్పింది. కానీ పట్టించుకునే వారెక్కడ మరి
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌందర్యాన్ని వికసింపచేసే నెయ్యి