నాజూగ్గా ఉండేవారు ఎలాంటి డైట్ పాటిస్తారు? అలా ఉండేవారంతా ఎప్పుడూ తమ బ్రేక్‌ఫాస్ట్ తినడం మానరట. అలాగే సులభమైన ఆహారపు అలవాట్ల ద్వారా తమ శరీర బరువు పెరగకుండా చూసుకుంటారట. ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా తినాలి. అపుడే రోజంతా ఉత్సాహంగా మీ పని మీరు చేసుకునేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడిలు లేకుండా ఉండాలట. ఒత్తిడి కారణంగా కొందరు విపరీతంగా తినేస్తుంటారు. దీంతో బరువు పెరిగిపోవడం ఖాయం.
కాబట్టి ఒత్తిడి దరి చేరనీయకుండా మితంగా ఆహారం సేవిస్తుంటే చాలా మంచిదట. వ్యాయామం చేస్తూ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే మీ ఫిట్నెస్‌ను కాపాడుకోవొచ్చట. ఇలా చాలా విషయాలు ఈ అధ్యయనంలో వెల్లడయ్యాయి. స్లిమ్‌గా ఉండే 147 మందిపై బ్రియాన్ అధ్యయనం చేశారు. వారు పాటించే డైట్, ఎక్సర్‌సైజ్, డైలీ లైఫ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే?
రోజూ బ్రేక్ ఫాస్ట్ మిస్సవరు : స‌్లిమ్‌గా ఉండే వారిలో 96 శాతం మంది రోజూ బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా తింటున్నారట. మనం రోజూ తీసుకునే ఫుడ్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. ఒక వేళ ఎవరైనా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినకుంటే, లంచ్ టైమ్‌లో ఎక్కువ ఆహారం తీసుకుంటాం. దీంతో లావైపోతాం. ఎక్కువ వెయిట్ తో బాధపడే వారిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్పింగ్ చేసిన వాళ్లే ఉంటారట. అందువల్ల రోజూ బ్రేక్ ఫాస్ట్ తినడం మరిచిపోకండి.
ఎక్సర్ సైజ్ తప్పకుండా చేస్తారట: ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 42 శాతంమంది వారంలో ఐదు లేదా అంత కంటే ఎక్కువ సార్లు వ్యాయామం చేస్తారట. ఎక్సర్ సైజ్ వల్ల మన బాడీతో పాటు మనస్సు కూడా ఉత్తేజితమవుతుంది. అలాగే ఒత్తిడి నుంచి దూరం కావొచ్చు. డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. వ్యాయామం వల్ల ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు వెయిట్ లాస్ అవడానికి అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటారు...: స్లిమ్‌గా ఉండేవారంతా తమ బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారట. ఈ పరిశోధనలో పార్టిసిపేట్ చేసిన వారిలో సుమారు 50 శాతం వారంలో కనీసం ఒక్కసారైనా తమ బరువు చెక్ చేసుకుంటామని చెప్పారు. దీని ద్వారా ఎప్పకప్పుడు తమకు తాము అలర్ట్ అవుతామన్నారు. ఒకవేళ బరువు పెరిగినట్లయితే వెంటనే కంట్రోల్ కావడానికి పాటించాల్సిన పద్ధతులను ఆచరిస్తామని వారు చెప్పారు.
ఏది తినాల్సి అనిపిస్తే అది తినడం: ఈ పరిశోధన ప్రకారం 44 శాతం మంది వారు ఏది తినాలనుకుంటారో అది తింటూ ఉంటారట. అది తినాలి.. ఇది తినకూడదనే నిబంధనలు ఏమీ పెట్టుకోరట. ఒక వేళ మీరు ఆఫీస్ లో ఉంటున్నప్పుడు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తున్నట్లయితే మీరు ఇంటి దగ్గర నుంచే కొన్ని పౌష్టిక విలువలు కలిగిన స్నాక్స్ తీసుకొచ్చుకోవడం బెస్ట్ అట. వాటిని తినడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ పరిశోధన పాల్లొన్న వారిలో 74 శాతం మంది తాము ఎప్పుడు కూడా డైట్ పాటించడం లేదని చెప్పారు. స్లిమ్ గా ఉండాలని కోరుకునే వారంతా కచ్చితంగా కరెక్ట్ సమయానికి తినాలన్నారు. ఆహారాన్ని సమయానుసారంగా తీసుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతాయన్నారు