Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

హైదరాబాద్‌లో రుతుక్రమ ఆరోగ్యం-పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించేందుకు పి అండ్ జి విస్పర్, యునెస్కో భాగస్వామ్యం

Advertiesment
girls
, సోమవారం, 19 జూన్ 2023 (18:08 IST)
పీరియడ్ ఎడ్యుకేషన్ మరియు ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల భారతదేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు చదువు మానేస్తున్నారు. అమ్మాయికి తల్లి మొదటి  గురువు, కానీ నివేదికల ప్రకారం 10 మంది తల్లులలో ఏడుగురు పీరియడ్స్ యొక్క శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అది 'మురికి లేదా అశుద్ధమైనది'గా భావిస్తున్నారని  కనుగొనబడింది. బహిష్టు విద్య మరియు పరిశుభ్రత నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి, పి & జి విస్పర్, యునెస్కో ఇండియాలు అమృత విశ్వ విద్యాపీఠంతో కలిసి, ముఖ్యంగా పాఠశాలకు హాజరయ్యే యువతులతో సహా మహిళల్లో అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాయి. C20 ఇండియా యొక్క లింగ సమానత్వం మరియు ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ హెల్త్ వర్కింగ్ గ్రూపులు హైదరాబాద్‌లోని బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించాయి. విస్పర్‌తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్‌లను పరిచయం చేశారు. 
 
"స్పాట్‌లైట్ రెడ్" అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు మరియు కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్ర వనరులు మరియు వ్యూహాలను అందిస్తాయి. ఋతుస్రావం నిర్వహణకు సంబంధించిన అవగాహన మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడం మరియు దాని సామాజిక ప్రభావం గురించి అవగాహన పెంపొందించడం వారి ఉద్దేశ్యం. 
 
పి & జి విస్పర్ మరియు యునెస్కో ఇండియా కూడా #KeepGirlsinSchool ప్రచారం కింద రుతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత నిర్వహణపై జాతీయ సర్వే మరియు గ్యాప్ విశ్లేషణ నివేదికను విడుదల చేశాయి. పేద పట్టణ ప్రాంతాల్లో, 50% యుక్తవయస్సులో ఉన్న బాలికలు (15 నుండి 19 సంవత్సరాల వయస్సు) వారి పీరియడ్స్ నిర్వహణకు పరిశుభ్రమైన పద్ధతులు అందుబాటులో లేవని నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన బాలికలు, ఉపాధ్యాయులు, పౌర సమాజ సంస్థలతో సహా 220 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులలో ముఖ్య అతిథి డాక్టర్ సౌమ్య మిశ్రా, IPS, అడిషనల్  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, DGP కార్యాలయం, హైదరాబాద్; గౌరవ అతిథి, శ్రీమతి డి హరి చందన, IAS, ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సెక్రటేరియట్, హైదరాబాద్; డాక్టర్ హుమా మసూద్, యునెస్కో ఇండియాలో సీనియర్ జెండర్ స్పెషలిస్ట్; శ్రీమతి శిల్పి గుప్తా, ప్రొడక్ట్ సప్లై లీడర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా; మరియు డాక్టర్ ప్రజ్ఞాత కొమరవోలు, కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో పీడియాట్రిక్ కన్సల్టెంట్ వున్నారు. 
 
డాక్టర్ హుమా మసూద్ మాట్లాడుతూ, “యునెస్కో మరియు పి&జి విస్పర్ కార్యక్రమం స్పాట్‌లైట్ రెడ్, పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత నిర్వహణ యొక్క తక్షణ అవసరాన్ని పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం #KeepGirlsinSchool..." అని అన్నారు.  శ్రీమతి డి హరి చందన, IAS మాట్లాడుతూ, "మనం ఆడపిల్లలకే కాదు, అబ్బాయిలకు, తండ్రులకు మరియు ప్రతి వ్యక్తికి కూడా ఈ విద్యను అందించాలి, సాంస్కృతిక నిషేధాలను ఛేదించి, అవగాహనను పెంపొందించాలి. సమాజాన్ని మార్చే శక్తి మనకు ఉంది. ఈ సందేశాన్ని వ్యాప్తి చేద్దాం, ఇతరులను ప్రేరేపించి, ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దాం" అని అన్నారు.
 
ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాలో ప్రొడక్ట్ సప్లై లీడర్ శ్రీమతి శిల్పి గుప్తా మాట్లాడుతూ, "యునెస్కోతో కలిసి సమగ్రమైన టీచింగ్ మాడ్యూల్స్‌ను ఆవిష్కరించడం పట్ల సంతోషంగా వున్నాను. పీరియడ్ సమాచారం మాత్రమే కాకుండా పోషకాహారం, విభిన్న లింగాలు మరియు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం కూడా కలిగి ఉంటాయి" అని అన్నారు. ఈ కార్యక్రమ, సంధర్భంగా యునెస్కో ఒక సమగ్ర సర్వే మరియు గ్యాప్ అనాలిసిస్ నివేదికను ప్రదర్శించింది, దానితో పాటుగా రుతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత నిర్వహణ యొక్క విభిన్న కోణాలను ప్రభావవంతంగా చిత్రీకరించే లఘు చిత్రాల శ్రేణిని, అలాగే "ప్రైడ్ ఆఫ్ పీరియడ్ యాంథమ్" కూడా ప్రదర్శించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రిడ్జిలో ఏ పండు ఎంతకాలం నిల్వ పెట్టవచ్చు?