Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పసిబిడ్డతోపాటు అర్థరాత్రి భార్యను విమానాశ్రయంలో వదిలి చెక్కేసిన ఎన్నారై భర్త

అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి పసిబిడ్డతో సహా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది.

పసిబిడ్డతోపాటు అర్థరాత్రి భార్యను విమానాశ్రయంలో వదిలి చెక్కేసిన ఎన్నారై భర్త
హైదరాబాద్ , శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (04:53 IST)
ఎన్నారైలు... తెలుగులో చెప్పాలంటే ఇండియాలో నివసించని భారతీయులు.. ఇంకోమాటలో చెప్పాలంటే ఇండియాకు బయట బతుకుతున్నా.. ఇండియన్ పిదపబుద్దులు పోనిచ్చుకోని భారతీయులు.. అందరినీ ఒకే గాట కట్టలేము కానీ భార్యాభర్తల సంబంధాల విషయంకొస్తే సగటు భారతీయుడి మగబుద్ధికి ఏమాత్రం తీసిపోనివారు. ఈ కోవలో నడుస్తున్న ఒక జీవి బుధవారం రాత్రి తన భార్యను, పసిబిడ్డను అర్ధరాత్రి పైసా డబ్బులు చేతిలో పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టిన ఘటనకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు సాక్షీభూతమై నిలిచింది. కారణం కట్నం గొడవలు, 
 
అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి  పసిబిడ్డతో సహా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది. వనస్థలిపురంకు చెందిన శిరీషను, రామంతపూర్‌కు చెందిన యలాల కీర్తిసాయిరెడ్డికి ఇచ్చి 2015జూన్‌లో పెళ్లి చేశారు. 
 
పెళ్‌లైన పదిరోజులకు భర్తతో కలిసి అమెరికాలోని వర్జినియాకు వెళ్లింది. కొద్ది రోజులకే భర్త కీర్తిసాయిరెడ్డి, అత్త వనిత నుంచి ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. పెళ్లి సమయంలో 36తులాల బంగారం, ఎకరం భూమి, వెండి, రూ.లక్ష నగదును ఇచ్చామని, అయినా తన అత్త వనిత అదనపు కట్నం కావాలని వేధించడమేగాక, భర్తను అందుకు పురిగొల్పేదన్నారు.
 
తన భర్త కీర్తిసాయి రెడ్డి ఇంట్లో సీసీకెమెరాలు అమర్చి తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో ప్రతిదీ గమనించి సాయంత్రం ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేవాడన్నారు. పుట్టిన బిడ్డకు పాలు ఇస్తే తనకు దగ్గరవుతాడని, తన కుమారుడికి పాలుపట్టనిచ్చేవారు కాదన్నారు. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన తాము శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చే సరికి అర్థరాత్రి 2.30గంటలు అయ్యిందన్నారు. ఆ సమయంలో తనను, బిడ్డతో సహా ఒంటరిగా వదిలేసి తాను ఒక్కడే వదిలేసి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది.
 
చేతిలో రూపాయి లేక, ఫోన్‌ చేసేందుకు సెల్‌ఫోన్‌ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను గుర్తించిన ఓ ఏఎస్‌సై క్యాబ్‌లో కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి ఇంటికి పంపారని తెలిపింది. అచ్యుతరావు మాట్లాడుతూ పసికందు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న   కీర్తిసాయిరెడ్డి, వనితలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చికెన్‌తో సమోసా ఎలా చేయాలి?