Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చికెన్‌తో సమోసా ఎలా చేయాలి?

సమోసా షేపులు చేసుకుని మధ్య చికెన్ స్టఫ్ నింపి.. అన్ని వైపులా క్లోజ్ చేస్తూ సమోసాలు ఒత్తుకోవాలి. ఇలా సమోసాలు ఒత్తుకున్నాక పక్కనబెట్టుకోవాలి. ఆపై పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర

కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చికెన్‌తో సమోసా ఎలా చేయాలి?
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (17:40 IST)
చికెన్‌ను వారంలో ఓసారి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించవద్దు. రక్తపోటును కూడా అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా క్యాన్సర్ కారకాలను తరిమికొట్టవచ్చు. అలాంటి చికెన్‌తో ఎప్పుడూ గ్రేవీ ఫ్రైలు కాకుండా వెరైటీగా సమోసాను ట్రై చేయండి. 
 
కావల్సిన పదార్థాలు:
చికెన్ : ఒకటిన్నర కప్పు 
రెడ్ చిల్లీ పెప్ప్ పౌడర్: మూడు స్పూన్లు
గరం మసాల: ఒకటిన్నర స్పూన్
ధనియాలపొడి: మూడు స్పూన్లు 
ఉల్లిపాయలు తరుగు : ఒక కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు- ఒక స్పూన్ 
కోడిగుడ్లు : రెండు
మైదా : రెండు కప్పులు
పసుపు: ఒక స్పూన్
సోంపు పౌడర్: ఒక స్పూన్
పెప్పర్ : ఒక స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత 
నీళ్ళు సరిపడా
 
తయారీ విధానం: 
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక.. ఉల్లితరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో శుభ్రం చేసుకున్న చికెన్ చేర్చుకోవాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కబెట్టుకోవాలి. మరో బౌల్ తీసుకుని మైదా పిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు, వేసి మెత్తగా మృదువుగా కలిపి పక్కనబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని సమోసాలు వత్తుకునేలా సిద్ధం చేసుకోవాలి. 
 
సమోసా షేపులు చేసుకుని మధ్య చికెన్ స్టఫ్ నింపి.. అన్ని వైపులా క్లోజ్ చేస్తూ సమోసాలు ఒత్తుకోవాలి. ఇలా సమోసాలు ఒత్తుకున్నాక పక్కనబెట్టుకోవాలి. ఆపై పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సమోసాలను వేసి దోరగా వేపి సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ సమోసాలను గ్రీన్ చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాటి కల్లు దివ్యౌషధమా?