Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

Advertiesment
Alarm

సెల్వి

, బుధవారం, 24 సెప్టెంబరు 2025 (22:37 IST)
Alarm
తెల్లవారుజామున అలారం పెట్టడం చాలామందికి అలవాటు. ఉదయం పూట అలారం పెట్టుకుంటే.. స్కూళ్లకు పిల్లలను సమయానికి పంపడం, ఉద్యోగాలకు సరైన టైమ్‌కి వెళ్లడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. అలారం పెట్టుకుని నిద్రలేవడం చేస్తే మెదడుకు, గుండెకు ఒత్తిడి తెచ్చే అవకాశం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
అవసరం ఎలాంటిదైనా హడావుడిగా అలారం పెట్టుకుని నిద్రలేవడం అలవాటు చేసుకోకూడదు. అవసరం లేకుండా నెమ్మదిగా, ప్రశాంతంగా నిద్రలేవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే అలారం అయితే గాఢ నిద్ర నుంచి ఉలిక్కిపడి నిద్రలేపేస్తుంది. ఇలా ఉలిక్కిపడి నిద్రలేస్తే మానసిక ఒత్తిడిని ఇచ్చే హార్మోన్ కార్డియోల్స్ ఉత్పత్తి ఎక్కువవుతాయి. కార్డిసోల్ సాధారణంగా ఉదయం పూట నెమ్మదిగా నిద్రలేచే వారిలో తక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. 
 
అయితే అలారం పెట్టుకుని హడావుడిగా నిద్రలేస్తే.. ఆ వేగం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. దీంతో మెదడు, గుండెకు దెబ్బేనని నిపుణులు తెలిపారు. ఇలా ఉన్నట్టుండి కార్డిసోల్ ఉత్పత్తితో గుండె జబ్బులు తప్పవని, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలోంచి అలారం మోగగానే నిద్రలేవడం ద్వారా రక్తపోటు, గుండె చప్పుడు అధికమవుతుంది. అలాగే గుండె సంబంధిత రుగ్మతలు వుండేవారు అలారం పెట్టుకుని నిద్రించడం చేయకూడదు. ఇలా రోజూ చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. 
 
గుండెకు, మెదడును దెబ్బతీసే అలారం మోత కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అలసట, సోమరితనం వంటివి తప్పవు. వీటికి అలారం పెట్టుకుని నిద్రలేవడమే ప్రధాన కారణం కావచ్చు. మెదడు పనితీరు మందగిస్తుంది. అలారం మోత లేకుండానే సమయానికి నిద్రకు ఉపక్రమించి.. ఉదయాన్నే సరైన సమయానికి లేవడం అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. అలారం మోత లేకుండా నిద్రలేవడం ద్వారా ఆరోగ్యంగా వుంటారని.. మెదడు, గుండె ఆరోగ్యంగా వుంటుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఇందుకోసం సరైన జీవన విధానం, వ్యాయామం వంటివి చేయడం ఉత్తమం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు