హైదరాబాద్: జోస్ అలుక్కాస్, భారతదేశంలో నాణ్యమైన, వినూత్నమైన, ఫ్యాషన్ ఆభరణాలలో విశ్వసనీయ పేరు, సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 5 వరకు బేగంపేటలోని వారి గ్రీన్‌ల్యాండ్స్ రోడ్ షోరూమ్‌లో ప్రపంచ స్థాయి వజ్రాలను కలిగి ఉన్న సిగ్నేచర్ జ్యువెలరీ షోను నిర్వహిస్తోంది. ఈ ఎక్స్‌పోను జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ అలుక్కాస్ ప్రారంభించారు.
జోస్ అలుక్కాస్ సిగ్నేచర్ జ్యువెలర్ షోలో ప్రత్యేకమైన సమకాలీన డిజైన్లలో సహజ వజ్రాల అద్భుతమైన సేకరణ ఉంటుంది. జాగ్రత్తగా కత్తిరించిన ఈ శ్రేణి వజ్రాలను అంతర్జాతీయ ప్రయోగశాలలలో పరీక్షించారు, బై-బ్యాక్ గ్యారెంటీ, తక్కువ తయారీ ఛార్జీలు ఉంటాయి. ఈ ప్రదర్శనలో జోస్ అలుక్కాస్ వజ్రాలలో లేటెస్ట్ డిజైన్లు, సంక్లిష్టంగా రూపకల్పన చేసిన నెక్లెస్‌లు, స్టేట్‌మెంట్ చెవిపోగులు, ప్రత్యేక బెస్పోక్ బ్రైడల్ సెట్‌లు ప్రదర్శించబడతాయి. తొలిసారిగా, ఇంతకుముందు ఎక్కడా చూడని కళాత్మక ఆభరణాలు ప్రదర్శనలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి, ఇది ఆభరణాల ప్రియులు, సేకరణకారులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అదనంగా, వ్యక్తిగత శైలి, ప్రాధాన్యతలకు తగ్గట్టు ఆభరణాలను అనుకూలీకరించే సౌకర్యం కూడా వినియోగదారులు పొందవచ్చు.
కస్టమర్లకు ప్రతి కొనుగోలుపై క్యారెట్‌కు 20 శాతం తగ్గింపు, 500 mg బంగారు నాణెం ఉచిత ఆఫర్ లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయోగశాల-ధృవీకరించబడిన వజ్రాలతో పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సిగ్నేచర్ జ్యువెలరీ షో గురించి మాట్లాడుతూ, మిస్టర్. వర్గీస్ అలుక్కాస్, మేనేజింగ్ డైరెక్టర్, జోస్ అలుక్కాస్ ఇలా అన్నారు, సమకాలీన వజ్రాల పీసులతో పాటు, మా కాలాతీత వజ్రాల సేకరణను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము, ఇది చక్కటి ఆభరణాలను హృదయపూర్వకంగా స్వాగతించే నగరం. సిగ్నేచర్ జ్యువెలరి షో మా అద్భుతమైన నైపుణ్యాన్ని, డిజైన్లో మా ఆవిష్కరణను అందిస్తుంది. వినియోగదారులు ప్రదర్శనను ఆస్వాదిస్తూ, సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్లతో ఆనందించవచ్చు. విస్తృతమైన డిస్కౌంట్ ఆఫర్లు, వినియోగదారుల కోసం అందించబోయే ప్రత్యేక బహుమతులతో, ప్రతి ఒక్కరు ప్రదర్శన నుండి సంతోషంగా, తృప్తితో బయటకు వెళ్తారు.