Publish Date: Tue, 15 Dec 2015 (12:43 IST)
Updated Date: Tue, 15 Dec 2015 (12:45 IST)
మహిళలకు పాతికేళ్లు దాటాయా.. అయితే హెల్త్ టెస్టు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాతిక సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవారు ఆరోగ్యపరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. అందులో ఒక పరీక్ష కంటిభాగానికి సంబంధించినది. దానితో పాటుగా స్తనాల పరీక్ష, మూత్ర పరీక్ష, రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవాలి. అప్పటినుండి రెండు మూడు సంవత్సరాలకొకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
45వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది మొదలు రక్తంలో కొలెస్టరాల్ పరీక్ష తప్పనిసరి. రక్తపోటు పరీక్ష రెండేళ్ళకొకసారి చేయించుకోవాలి. కాలేయ, కంటి పరీక్షలు పరిస్థితిని బట్టి చేయించుకోవాలి. పాతిక సంవత్సరాల తర్వాత శరీర రూపంలో తేడా రావడం మొదలవుతుంది. కాబట్టి శరీరపు ఎత్తు బరువును బట్టిచేసే బాడీమాస్ ఇండెక్స్ అంచనా వేయించుకుని వయసుకు తగిన బరువున్నదా లేదాని డాక్టర్‌ని సంప్రదించి తెలుసుకోవాలి.