Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ టీతో ఊబకాయానికి చెక్ పెట్టండి!

Advertiesment
Green tea benefits
కొందరిలో ఊబకాయం విపరీతంగా ఉంటుంది. అలాంటి వారు ఏమీ తినకపోయినా లావుగానే ఉంటారు. ఇలాంటి వారు తమ శరీర బరువును తగ్గించుకోవడానికి గ్రీన్ టీ సేవిస్తే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
నిత్యం గ్రీన్ టీ సేవిస్తుంటే శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్, ట్రిగ్లీసి రైడ్స్, ఫైబ్రోనోజిన్ లాంటి వాటిని శరీరంలో ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. అలాగే శరీరంలోని కెలొరీలను ఖర్చు చేసేస్తుంది. ఉదరభాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది. 
 
శరీరానికి సరిపడా తేమను అందించేందుకు కేవలం నీరు తీసుకుంటేనే సరిపోదు. గ్రీన్ టీ కూడా నీటితో సమానంగా శరీరానికి తేమనందిస్తుంది. శరీరంలో ద్రవపదార్థాల స్థాయిని నిలకడగా ఉంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu