అల్లం నెలసరి నొప్పిని తగ్గిస్తుందట.. ఆ మూడు రోజులు అల్లం పొడిని..?
అల్లం తీసుకుంటే.. మధుమేహం, ఊబకాయం, హృద్రోగ వ్యాధులు దరిచేరవు. రోజూ మూడు గ్రాముల అల్లంపొడిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. అల్లంను ఆహారంలో తీసుకోవడం ద్వారా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశా
అల్లం తీసుకుంటే.. మధుమేహం, ఊబకాయం, హృద్రోగ వ్యాధులు దరిచేరవు. రోజూ మూడు గ్రాముల అల్లంపొడిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. అల్లంను ఆహారంలో తీసుకోవడం ద్వారా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అల్లం నెలసరి నొప్పిని తగ్గిస్తుందట. ఆ సమయంలో నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లకి రోజుకి గ్రాము అల్లంపొడిని వరసగా మూడురోజులపాటు ఇస్తే నొప్పి తగ్గుతుంది. అల్లంలోని జింజరాల్‌వల్ల ఇన్ఫెక్షన్లూ దరిచేరవు.
అల్లంలోని జింజరాల్, బీటాకెరోటిన్, క్యాప్సైసిన్, కెఫీక్ ఆమ్లం, కురుక్యుమిన్, శాలిసిలేట్ తదితర యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంవల్ల అల్లం కండరాల నొప్పుల్నీ ఆస్టియో ఆర్థ్రయిటిస్ కారణంగా వచ్చే మంటల్నీ తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ వంటి వ్యాధుల్నీ అల్లం నివారిస్తుందని వారు సూచిస్తున్నారు.