రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఎప్పటికప్పుడు పనుల్ని పూర్తి చేయండి
ఉదయం పూట చిరాగ్గా ఉండకుండా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం.. పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకుండా ఉండాలంటే.. ఎప్పటి పనుల్ని అప్పటికప్పుడే పూర్తి చేసుకుంటూ పోవాలి.
ఉదయం పూట చిరాగ్గా ఉండకుండా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం.. పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకుండా ఉండాలంటే.. ఎప్పటి పనుల్ని అప్పటికప్పుడే పూర్తి చేసుకుంటూ పోవాలి. మరుసటి రోజు పనుల్ని చకచక ముందురోజే పూర్తి చేసేసుకోవాలి. అలా చేస్తే కంగారు.. హడావుడి దూరమవుతుంది. మర్నాడు హాయిగా నిద్రలేచి ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు.
* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం అనేది ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది. దీనివల్ల జీవక్రియల రేటు మెరుగవుతుంది. ఈ ప్రక్రియని కొనసాగించాలంటే.. సెలవు రోజూ ఉదయాన్నే లేవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే, అలారంతో పని లేకుండా పొద్దున్నే, ఆ సమయం కాగానే నిద్ర నుంచి సులభంగా మేల్కొనవచ్చు.
* నిద్రలేవగానే బద్ధకం, మత్తుగా అనిపిస్తే దాన్ని వెంటనే వదిలించుకోవాలి. లేదంటే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం పూట సూర్మరశ్మి తగిలితే శరీరానికి నూతనోత్తేజం అందుతుంది, అసౌకర్యం దూరమవుతుంది. ఎండలో ఉండే 'డి' విటమిన్ ఒత్తిళ్లనూ దూరం చేస్తుంది.
* ఎండ తగిలే అవకాశం లేని పక్షంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి ధ్యానం, పూజ చేసుకుంటే.. రోజంతా ఉత్సాహం సులభంగా వచ్చేస్తుంది. గ్రీన్ టీనో, కాఫీనో తాగితే ఉత్సాహం వస్తుంది.