కొబ్బరి పాలు తీసుకుంటే కీళ్లనొప్పులు వుండవండోయ్..
మూడు పదులు దాటిన వెంటనే మహిళల్లో క్యాల్షియం శాతం లోపిస్తుంది. క్యాల్షియం తగ్గడంతో కీళ్లనొప్పులు ఆవహిస్తాయి. అలాంటి సమయంలో కొబ్బరి పాలును డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆవు
మూడు పదులు దాటిన వెంటనే మహిళల్లో క్యాల్షియం శాతం లోపిస్తుంది. క్యాల్షియం తగ్గడంతో కీళ్లనొప్పులు ఆవహిస్తాయి. అలాంటి సమయంలో కొబ్బరి పాలును డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆవు పాలను రోజుకు రెండు పూటలా తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. అలాగే కొబ్బరి నుంచి తీసిన పాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు అదుపులో వుంటాయి.
కొబ్బరిని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి చిక్కని పాలు తీస్తారు. వీటిని వంటకాల్లో వాడొచ్చు. ఈ పాలకు కాస్త పంచదార కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. అలాగే ఎండిన సోయా బీన్స్‌ని నీళ్లల్లో నానబెట్టి పాలు తీస్తారు. లాక్టోజ్ పడనివాళ్లు దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ పాలను తాగడం వల్ల రక్తనాళాలు బలపడతాయి. మెనోపాజ్ సమయంలో సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. దీంట్లో శాచురేటెడ్ ఫ్యాట్, చక్కెరశాతం చాలా తక్కువగా ఉంటుంది. మాంసకృత్తులు అందుతాయి.
అదేవిధంగా బాదంపప్పుని నానబెట్టి పాలు తీయడం కూడా చాలా సులువు. వీటినుంచి తగినన్ని మాంసకృత్తులూ, యాంటీ ఆక్సిడెంట్‌లూ, విటమిన్-ఇ, ఇనుము, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటివెన్నో అందుతాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎముకలకు బలాన్నిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.