Publish Date: Mon, 05 Jan 2015 (16:06 IST)
Updated Date: Mon, 05 Jan 2015 (16:07 IST)
జుట్టు నల్లబడకుండా ఉండాలంటే.. క్యారెట్ జ్యూస్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కేశాల రంగును స్థిరంగా ఉంచడానికి, ముదురు రంగుల్లో తీసుకురావడానికి క్యారెట్‌లోని కెరోటినాయిడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అయితే క్యారెట్ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి జ్యూస్‌కు బదులు క్యారెట్స్ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
ఇంకా జుట్టును నల్లగా మార్చాలంటే తాజా కరివేపాకు ఆకలును వేడి నూనెలో వేసి కొద్దిగా వేడి చేయాలి. ఈ నూనెను బాగా చల్లరనివ్వాలి. ఒక వారం తర్వాత ఈ నూనెను తలకు మసాజ్ చేసుకోవడం వల్ల కేశాలు నల్లగా మారుతాయి. హెయిర్ పిగ్మెంటేషన్‌కు మందార నూనె సూపర్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.