Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణీ స్త్రీకి ఆయుర్వేద చిట్కాలు..

Advertiesment
Ayurvedic tips
ప్రతి గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని సంరక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. గర్భం సురక్షితంగా ఉంటే కూడా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు. 
 
* గర్భం ధరించిన తొలి నెలలో ప్రతి రోజూ రెండుపూటలా పాలలో కలకండను కలుపుకుని సేవించాలి.  
 
* రెండవ నెలలో గోరువెచ్చని పాలలో శతావరీ చూర్ణం 10 గ్రాములు కలుపుకుని త్రాగాలి.
 
* మూడవ నెలలో చల్లటిపాలలో ఒక చెంచా నెయ్యి మరియు మూడు చెంచాల తేనె కలుపుకుని సేవించాలి. ఇలా ఎనిమిదవ నెల వరకు చేస్తుండాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 
 
* నాల్గవ నెలలో పాలలో వెన్న కలుపుకుని సేవించాలి.
 
* ఐదవ నెలలో మళ్ళీ పాలలో నెయ్యి కలుపుకుని సేవించండి.
 
* ఆరు మరియు ఏడవ నెలలో మళ్ళీ పాలలో శతావరీ చూర్ణం కలుపుకుని సేవించండి.
 
* ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలుపుకుని త్రాగాలి.
 
* తొమ్మిదవ నెలలో శతావరినుంచి తీసిన నూనెను 50 గ్రాముల చొప్పున ప్రతి మూడవ రోజుకు ఒకసారి ఎనీమా తీసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
* మూడవ నెలనుంచి ఎనిమిదవ నెల వరకు రెండు పూటలా పెద్ద చెంచాతో ఆవు నెయ్యిని పాలలో కలుపుకుని సేవించండి. 

Share this Story:

Follow Webdunia telugu