గణేష్ ఉత్సవాల సంబరం ప్రారంభమైంది. ఇప్పటికే కొన్నిచోట్ల నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున గణనాధుని నిమజ్జనం కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదిలావుంటే గణేషుని విగ్రహాల వద్ద ప్రతిరోజూ పూజలు చేసేవారు సాయంత్రం పూజ ముగిశాక ఈ క్రింది మంగళహారుతులతో స్తుతిస్తే విఘ్నేశ్వరుడు ప్రసన్నడవుతాడని విశ్వాసం.
గణేశుని మంగళహారతులు ఒకసారి తెలుసుకుందాము.
జై జై గణేశా జై జై గణేశా, జై జై గణేశా పాహిమాం.
శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః, మంగళం సుమంగళం.
ఓం గణపతయే నమః, గణాధిపతయే నమః
సిద్ధి వినాయకా మంగళం, బుద్ధి ప్రదాతా మంగళం.
గౌరీ తనయా మంగళం, పార్వతీ సుతా మంగళం.
ఈ హారతులు వినాయకుని పూజలో పాడుకోవచ్చు.