Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భక్తులు కాణిపాకం ఆలయానికి రేపు త్వరగా రండి, ప్రతి 10 నిమిషాలకు ఓ ఆర్టీసి బస్సు

Advertiesment
Ganesh Chaturthi 2020
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:47 IST)
వినాయకచవితి అంటే చాలు వెంటనే ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది కాణిపాకం. స్వయంభుగా వెలసిన వరసిద్ధి వినాయకస్వామిని దర్సించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. స్వామివారి దర్సనం దొరకాలంటే కనీసం ఐదు నుంచి ఆరుగంటల పైన సమయం పడుతుంది. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రతి యేడాది వినాయకచవితి రోజు ఏర్పడుతుంది. 
 
కానీ ఏ యేడాది మాత్రం కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను దర్సనానికి అనుమతించాలని దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం 30 వేల మంది భక్తులను మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ దర్సనానికి అనుమతించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఆలయంలో శానిటైజర్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకునే భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారిని మాత్రం అనుమతించరు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
 
అయితే ఉత్సవాలన్నింటినీ ఏకాంతంగానే నిర్వహించనున్నారు. వాహన సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తారు. ఉత్సవాల ఊరేగింపు, గ్రామోత్సవాలను రద్దు చేశారు దేవస్థానం అధికారులు. 50 మంది ఉభయదారులతో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం 4 గంటల నుంచి  భక్తులను దర్సనానికి అనుమతిస్తారు. 
 
మరోవైపు ఆర్టీసీ కూడా కాణిపాకంకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉదయం 4 గంటల నుంచే ప్రయాణీకుల కోసం బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును నడపడానికి ఆర్టీసీ సిద్థమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 22, రేపే వినాయక చవితి, ఎలాంటి గణపతికి పూజలు చేయాలి?