Article Vegetarian Food %e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b6%e0%b1%86 108082500088_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచూరియా దోశె

Advertiesment
వంటకాలు శాకాహారం మినప్పప్పు మెంతులు క్యారెట్లు గ్రీన్ బఠాణీ వెల్లుల్లి సోయాసాస్
FileFILE
కావలసిన పదార్థాలు :
ఛాయ మినప్పప్పు... 150 గ్రాములు
మెంతులు... పది గ్రాములు
క్యారెట్లు... పావుకేజీ
గ్రీన్ బఠాణీ... వంద గ్రాములు
వెల్లుల్లి... 20 గ్రాములు
సోయాసాస్... రెండు టీస్పూన్లు
అజినమోటో... పావు టీస్పూన్
ఉప్పు... సరిపడా
ఉప్పుడు బియ్యం... అరకేజీ
సెనగపప్పు... 50 గ్రాములు
బీన్స్... 150 గ్రాములు
పచ్చిమిర్చి... 20 గ్రాములు
అల్లం... పది గ్రాములు
చిల్లీసాస్... ఒక టీస్పూన్
రిఫైన్డ్ ఆయిల్... 50 గ్రాములు
కొత్తిమీర... ఒక కట్ట
కార్న్‌ఫ్లోర్... తగినంత

తయారీ విధానం :
మినప్పప్పు, బియ్యం, మెంతులు, సెనగపప్పును నానబెట్టాలి. ఆపైన మెత్తగా రుబ్బుకుని ఐదు గంటలసేపు పులియబెట్టాలి. తరువాత క్యారెట్, బీన్స్‌లను సన్నగా తరిగి, నీళ్ళలో ఉడికించి, వార్చి విడిగా ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ముందు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. తరువాత ఉడికించిన బీన్స్, క్యారెట్ వేసి కలిపాక, సోయాసాస్, అజినమోటో, చిల్లీసాస్, గ్రీన్ బఠాణీ వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.

అందులోనే కార్న్‌ఫ్లోర్ కలిపిన నీళ్ళు పోసి చిక్కబడ్డాక, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేస్తే మంచూరియా కర్రీ సిద్ధమైనట్లే...! ఇప్పుడు స్టవ్‌పైన అట్లపెనం పెట్టి తడిగుడ్డతో తుడిచాక పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు వేసి దోశె వేసుకోవాలి. ఈ దోశెను పైన సిద్ధం చేసుకున్న మంచూరియా కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu