Article Vegetarian Food %e0%b0%aa%e0%b1%86%e0%b0%b8%e0%b0%b0 %e0%b0%b5%e0%b0%a1 108072400083_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెసర వడ

Advertiesment
వంటకాలు శాకాహారం నెయ్యి పెసలు బంగాళాదుంపలు బియ్యంపిండి వేరుశెనగపొడి పచ్చిమిర్చి అల్లంతురుము ఉప్పు
, గురువారం, 24 జులై 2008 (18:56 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
మొలకెత్తిన పెసలు... పావు కేజీ
బంగాళాదుంపలు... మూడు
బియ్యంపిండి... రెండు టీస్పూన్లు
వేరుశెనగపొడి (వేయించి చేసినది)... ఒక టీస్పూన్
గరంమసాలా... పావు టీస్పూన్
ఆమ్‌చూర్ పొడి... పావు టీస్పూన్
పచ్చిమిర్చి... రెండు
అల్లంతురుము... ఒక టీస్పూన్
కొత్తిమీర తురుము... రెండు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
కారం... సరిపడా
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి చిదిమి ఉంచుకోవాలి. అందులోనే మొలకెత్తిన పెసలు, బియ్యంపిండి, వేరుశెనగపొడి, ఉప్పు, కారం, ఇతర మసాలాలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వాటిని వడలుగా వత్తుకోవాలి.

ఓ బాణలిలో నూనె పోసి కాగిన తరువాత అందులో ఈ వత్తుకున్న వడలను వేసి ఎర్రగా కాల్చాలి. వీటిని పుదీనీ, కొత్తిమీర చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu