Article Vegetarian Food %e0%b0%aa%e0%b1%86%e0%b0%b8%e0%b0%b0 %e0%b0%86%e0%b0%b5%e0%b0%95%e0%b0%be%e0%b0%af 108062600048_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెసర ఆవకాయ

Advertiesment
పెసర ఆవకాయ పుల్లటి మామిడి కాయలు పెసరపిండి ఉప్పు
కావలసిన పదార్థాలు :
పుల్లటి మామిడి కాయలు- 4
పెసరపిండి- 100 గ్రాములు
కారం- 100 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడ
నూనె - పావుకిలో
మెంతి పిండి- 1/2 చెంచా

తయారీ విధానం :
మామిడి కాయలను కడిగి తుడిచి పైన చెక్కుతీసుకోవాలి. కాయను అటు ఇటూ చెక్కలుగా కోసి దానిని మరల పొడుగాటి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరిగిన ముక్కలకు ఉప్పు, పసుపు కలిపి జాడీలో వేసి మూడు రోజుల పాటు ఉంచాలి. ప్రతిరోజు దాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి. మూడవ రోజుకి బాగా ఊట వచ్చాక ముక్కలను మాత్రమే గట్టిగా పిండి తీసి మంచి ఎండలో రెండు రోజుల పాటు ఎండబెట్టాలి. తర్వాత జాడీలోని ఊటలో కారం, ఆవపిండి, మెంతి పిండి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.

తరువాత బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి చల్లార్చి ఉంచాలి. ఎండిన మామిడికాయ ముక్కలను జాడీలో ఉన్న ఊటలో కలిపి వేపి ఉంచుకున్న తాలింపును జాడీలో ఉన్న మిశ్రమానికి బాగా కలిసేలా కలిపి మూతపెట్టాలి. వారం తర్వాత వాడితే ముక్కలు మెత్తబడి మాగాయి తయారుగా ఉంటుంది. ఇష్టమైన వారు వెల్లుల్లి 100 గ్రాములు తీసుకొని కచ్చపచ్చగా నూరి కలుపుకోండి. రుచి ఇంకా పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu