Article Vegetarian Food %e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81 %e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80 108071100028_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగు చట్నీ

Advertiesment
పెరుగు చట్నీ అల్లం పచ్చి మిరిపకాయలు కీర దోసకాయ పెరుగు అల్లం
కావలసిన పదార్థాలు :
పెరుగు... ఒక కప్పు
అల్లం... చిన్నముక్క
పచ్చిమిరపకాయలు... రెండు కాయలు
కీరదోసకాయ... రెండు కాయలు
కొత్తిమీర... రెండు రెమ్మలు
కరివేపాకు.... రెండు రెమ్మలు
నూనె... ఒక టీస్పూన్‌
ఆవాలు... ఒక టీస్పూన్‌
మినపప్పు... ఒక టీస్పూన్‌
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
అల్లం, పచ్చి మిరపకాయలను ముందుగా నూరిపెట్టుకోవాలి. కీరదోసకాయను కూడా తురిమిపెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకులను పెరుగులో వేసి తగినంత ఉప్పు చేర్చి కలుపుకోవాలి. దీనికి తురిమిన కీరదోస చేర్చి, ఆవాలు, మినపప్పును నూనెలో పోపు వేసి పెరుగు మిశ్రమంలో కలిపితే.... పసందైన పెరుగుపచ్చడి సిద్ధమైనట్టే.

Share this Story:

Follow Webdunia telugu