Publish Date: Fri, 25 Jul 2008 (19:38 IST)
Updated Date: Fri, 25 Jul 2008 (19:37 IST)
కావలసిన పదార్థాలు :
దోసకాయలు... అర కిలో
పచ్చిమిర్చి... ఆరు
వెల్లుల్లి... 2 రెబ్బలు
ఎండుమిర్చి... రెండు
పోపుగింజలు... సరిపడా
నూనె... 25 గ్రా
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
దోసకాయల పై చెక్కుతీసి చేదులేకుండా చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి వేరే ప్లేటులోకి ముక్కలుగా తరిగి తీసుకోవాలి. నూనె కాచి వెల్లుల్లి ఎండుమిర్చి పోపుగింజలు కరివేపాకూ వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి కూడా వేసి ఆ వెనకే దోసముక్కల్ని అందులో పోసి మూత పెట్టాలి. ముక్క బాగా మెత్తబడ్డాక ఉప్పు చల్లుకుని కలిపి దింపుకోవాలి. అంతే దోసకాయ కూర రెడీ. ఇది చపాతీల్లోకి బాగుంటుంది.