Publish Date: Thu, 08 Jan 2009 (20:18 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ దిబ్బరొట్టె పేరుగాంచింది. మందంగా ఉండటం వల్లనే దీనికి దిబ్బరొట్టె అనే పేరు వచ్చింది. దీన్ని ఇనుప మూకుడులో వండితే రుచే వేరుగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... అరకేజీ
బియ్యం రవ్వ... పావుకేజీ
ఉప్పు... సరిపడా
నూనె... తగినంత
జీలకర్ర... సరిపడా
తయారీ విధానం :
ముందుగా మినప్పప్పును నాలుగు గంటలపాటు నానబెట్టి, మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి. బియ్యం రవ్వను నీటిలో రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత రవ్వలో ఉన్న నీటిని ఒంపేసి, మినప్పిండిలో రవ్వను కలుపుకోవాలి.
పై మిశ్రమానికి ఉప్పు కలిపి కొద్దిసేపు పిండిని అలాగే ఉంచేయాలి. మందపాటి పెనంపై నూనె వేసి, పిండిని మందంగా పరిచి, సన్నని సెగపై మూతపెట్టి కాలనివ్వాలి. ఉడికాక రెండో వైపునకు తిప్పి కొద్ది నిమిషాలు ఉంచాలి. వేడి వేడిగా ఇష్టమైన పచ్చడితో తింటే రుచితో ఉంటాయి.