Publish Date: Mon, 02 Feb 2009 (18:13 IST)
Updated Date: Mon, 02 Feb 2009 (18:09 IST)
కావలసిన పదార్థాలు :
చింత చిగురు... 100 గ్రాములు
కందిపప్పు... 100 గ్రాములు
పచ్చిమిర్చి... ఆరు
ఎండుమిర్చి... రెండు
ఉప్పు... తగినంత
నూనె... 50 గ్రాములు
ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు, ఇంగువ... తాలింపుకు సరిపడా
తయారీ విధానం :
పప్పును సరిపడా పాత్రలో వేసి, గ్లాసెడు నీరు పోసి ఉడికించాలి. పప్పు ఓ ముప్పావు ఉడికిన తరువాత... పుల్లలు లేకుండా శుభ్రపరచి, నీటిలో కడిగి పక్కన పెట్టుకున్న చింతచిగురును, సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను వేసి ఉడికించాలి.
పప్పు, ఆకు బాగా ఉడికిన తరువాత దించి, పప్పులోని నీటిని వంపేసి... సరిపడా ఉప్పువేసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఆ తరువాత వంపేసిన నీటిని కలిపి ఉప్పు సరిజూసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కాస్తంత ఇంగువ వేసి పోపు పెట్టాలి.
పోపు బాగా వేగిన తరువాత మెదిపి ఉంచుకున్న పప్పును ఇందులో కలపాలి. అంతే వేడి వేడి చింత చిగురు పప్పు రెడీ అయినట్లే...! దీన్ని వేడి వేడి అన్నంలోనూ, చపాతీల్లోనూ తింటే చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది.