Article Vegetarian Food %e0%b0%86%e0%b0%b2%e0%b1%82 65 108081800055_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలూ-65

Advertiesment
వంటకాలు శాకాహారం బంగాళాదుంప ఉల్లిపాయ పెరుగు పచ్చిమిర్చి కారం గరంమసాలా
, సోమవారం, 18 ఆగస్టు 2008 (17:59 IST)
FileND
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... నాలుగు
ఉల్లిపాయలు... 2 పెద్దవి
తియ్యటి పెరుగు... పావు కప్పు
పచ్చిమిర్చి... రెండు
అజీనామోటా... అర చెంచా
కారం... అరచెంచా
బేకింగ్ పౌడర్... పావు చెంచా
గరంమసాలా... పావు చెంచా
శనగపిండి... 2 చెంచాలు
ఉప్పు, నూనె... సరిపడా

తయారీ విధానం :
బంగాళాదుంప ముక్కలను ఉడికించి తోలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి బేకింగ్ పౌడర్, శనగపిండి, ఉప్పు కలిపి వాటికి పట్టించి ఉంచాలి. వాటిని వేడినూనెలో ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. పెరుగును ఒక పల్చటి గుడ్డమీద పోసి నీరు పోయేంతవరకు వడకట్టి దానిని చిలికి మెత్తగా చేసి వుంచుకోవాలి.

ఉల్లి ముక్కలను అంగుళం పొడవుకు కట్ చేసుకొని బాండీలో రెండు గరిటెల నూనెను వేసి కాగిన తరువాత నిలువుగా కట్ చేసిన మిర్చి, ఉల్లిముక్కలు, అజినమోటాను వేసి ఎర్రగా వేయించి... దానికి వడకట్టి మెత్తగా చిలికి పెట్టిన పెరుగును కలపాలి. ఇందులోనే ఉప్పు, కారం, గరంమసాలా పొడులను చల్లి సన్నని మంటమీద నూనె పైకి తేలేంతవరకూ వేయించాలి. వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కొంచెం నీరు పోసి ఉడికించి చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu