Article Vegetarian Food %e0%b0%86%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b8%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be 108061900032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలు సమోసా

Advertiesment
ఆలు సమోసా మైదాపిండి ధనియాల పొడి సోడాబైకార్బోనేట్
కావలసిన పదార్థాలు :
మైదాపిండి-250 గ్రాములు
ధనియాల పొడి- ఒక చెంచా
గ్రీన్‌పీస్- ఒక కప్పు
సోడాబైకార్బోనేట్- చిటికెడు
పచ్చిమిర్చి- రెండు
బంగాళాదుంపలు- రెండు
ఉల్లిపాయ-ఒకటి
మిరియాల పొడి-అర చెంచా
గరం మసాలా- ఒక చెంచా
నూనె-వేపుడుకు తగినంత

తయారీ విధానం :
ముందుగా మైదాను ఒక పాత్రలోకి తీసుకుని, అందులో ఒక చెంచా నెయ్యి వేసి సరిపడా నీరు చేర్చి గట్టిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మైదా పిండి ఎండిపోకుండా తడిగుడ్డకో కప్పి ఐదు నిమిషాల పాటు ఊరనివ్వాలి. బంగాళాదుంపలను ఉడికించి తోలు తీసి మెత్తగా మెదిపి అందులో, బఠాణీలు, కారం, పచ్చిమిర్చి, సోడాబై కార్బొనేట్, మిరియాల పొడి, అల్లం పేస్ట్, గరంమసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి మిశ్రమంలా కలుపుకోవాలి.

కాసేపు ఊరనిచ్చిన మైదాపిండిని చిన్న ముద్దలు చేసి పూరీల్లా చేసి సగానికి కట్ చేసుకోవాలి. ఇలా కట్‌చేసుకున్న పూరీల్లో బంగాళాదుంప మిశ్రమం పెట్టి సమోసా ఆకారంలో మడిచి కాగిన నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాక, టమోటా లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu