అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్లో శరీరానికి చల్లదనాన్నిచ్చే పెరుగు, మెంతులతో చేసే వంటకాలను తీసుకుంటే మంచిది. మజ్జిగ ఆరోగ్యానికి క్యాల్షియం అందజేస్తుంది. ఇక మెంతులు శరీర ఉష్ణాన్ని నియంత్రించి అందం, ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. ఇక కేశాలను, చర్మాన్ని సంరక్షిస్తుంది. అలాంటి మజ్జిగ, మెంతులతో పుల్లట్లను వెరైటీగా ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
పుల్లటి మజ్జిగ : నాలుగు కప్పులు
బియ్యం - రెండు కప్పులు
మెంతులు - మూడు స్పూన్లు
జీలకర్ర - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి- ఆరు
ఉప్పు - తగినంత
జీలకర్ర - స్పూన్
నూనె - తగినంత
తయారీ విధానం :
ముందుగా మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పెనంపై పలుచగా చేసుకోవాలి. ఇరు వైపుల నూనె, లేదా నేతిని పోయాలి. ఇక దోసెలు దోరగా వేగాక సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ దోసెలను గ్రీన్ చట్నీ లేదా టమోటా చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!