Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్కని ఆహారపు అలవాట్లతో మొటిమలు మటుమాయం

Advertiesment
చక్కని ఆహారపు అలవాట్లతో మొటిమలు మటుమాయం
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (16:44 IST)
అందమైన అమ్మాయి మోముపై.. ఓ చిన్ని మొటిమ ముత్యంలా మెరిసిపోతుంది. అదే ముఖమంతా వ్యాప్తిస్తే.. మచ్చలు, యాక్ని (తొలిదశలో ఉండే మొటిమలు, వైట్, బ్లాక్ హెడ్స్ కలిపి)తో నిండి పోతే అమ్మో.. కౌమారంలో అడుగు పెడుతున్న అమ్మాయిలకు ఇదో పెద్ద కలవరపాటు ఆ మాటకొస్తే 80 శాతం పెద్దవారిలోనూ ఇటువంటి సమస్యలున్నాయని నిపుణులు అంటున్నారు.
 
యుక్త వయస్సులో మొదలైన ఈ సమస్య మూడు పదుల వరకు ఉంటుందట. విద్యార్థినులు, ఉద్యోగినుల్లో కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుందని నిపుణులు చెపుతున్నారు. కాలేయం, మూత్రపిండాలపై అధిక భారం పడటం, ఆహారంలో లోపం, హార్మోన్ల అసమతుల్యతల వల్ల కూడా వస్తుంటాయని చెపుతున్నారు. ఏవో పైపై పూతలు.. చికిత్సలు మొటిమలు, యాక్నేలని అరికట్టలేవు. చక్కని ఆహారపు అలవాట్లతో పాటు ఒత్తిడి నిరోధించే మార్గాలు, చికిత్సలు తోడవ్వాలి. అప్పుడే మేని నిగారింపు సాధ్యంమని ఈ అధ్యయనంలో తేలింది. 
 
ఇలా చేస్తే మొటిమలు మాయం... 
మంచి నీరు సమృద్ధిగా తాగడం వల్ల చర్మంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. రోజులో ఎనిమిది గ్లాసుల నీరు తాగితే యాక్ని నివారణలో మనం తొలి అడుగు వేసినట్టే. చర్మంపై పేరుకున్న వ్యర్థాలు తొలగిపోవాలంటే ఆహారంలో విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవాలి. ఇది చక్కని యాంటీ ఆక్సిడెంట్. బి కాంప్లెక్స్ ఒత్తిళ్లు తగ్గించి మెరిసే మేనుని సొంతం చేస్తుంది. తాజా కాయగూరలు, పండ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయి. 
 
ముఖ్యంగా యాపిల్, బొప్పాయి, అనాస, సలాడ్లు, ముదురాకు పచ్చని ఆకుకూరల్లో తగినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. విటమిన్ సి, ఇ లకు చర్మాన్ని శుభ్రపరిచి కొత్త కాంతి, నిగారింపుని ఇచ్చే శక్తి ఉంటుంది. తాజా కాయగూరలు, తృణధాన్యాలు, గింజలని తీసుకొనే వారికి ఈ విటమిన్లు అందుతాయి. అలాగే జింక్ అధికంగా ఉండే పుట్టగొడుగులు. గింజలు కూడా మేలు చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండే ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి...