Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మష్రూమ్ స్పెషల్ : మష్రూమ్ పనీర్ మసాలా

Advertiesment
Mushroom panneer masala
మహిళల్లో బ్లాడర్ సమస్యలకు మష్రూమ్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి కావలసిన విటమిన్ డిని అందిస్తుంది. ఐరన్‌తో పాటు లో క్యాలరీలను అందించే మష్రూమ్‌ను వారంలో ఒక్కసారైనా తీసుకుంటే బరువు తగ్గుతారని న్యూట్రీషన్స్ అంటున్నారు. అలాంటి మష్రూమ్‌తో పనీర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం.. 
 
పనీర్ ముక్కలు- అరకప్పు 
ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు 
పసుపు- చిటికెడు 
పచ్చి మిర్చి తరుగు- ఒక టీ స్పూన్ 
ధనియాల పొడి- 1 టీస్పూన్‌
గరం మసాలా పొడి- 1/2 టీ స్పూన్‌
కొబ్బరి పొడి - 2 టీస్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్లు 
ఉప్పు- తగినంత
జీలకర్ర - టీస్పూన్‌
ఆవాలు - పోపుకు తగినంత 
నూనె- తగినంత 
కొత్తిమీర - గార్నిష్‌కు సరిపడా 
 
తయారీ విధానం : 
ముందుగా మష్రూమ్స్ ముక్కలను, పనీర్‌ను తురుముని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిని వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్‌, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసి కలపాలి. పనీర్‌ కరిగిన తర్వాత అందులో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి రోటీలకు.. రైస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

Share this Story:

Follow Webdunia telugu