దుకాణాల్లో అమ్మే ప్యాకెట్ల రూపంలో వుండే స్నాక్స్ పిల్లలకు ఇవ్వడం కంటే.. పోషకాలతో కూడిన సులభంగా చేయగలిగే స్నాక్స్ పిల్లలకు అలాంటి వాటిలో బఠాణీలు, పనీర్ తో కట్ లెట్ ట్రై చేయండి. పిల్లలకు పోషకమైన స్నాక్స్. దీన్ని చేయడం చాలా సులభం.
కావలసిన పదార్థాలు
పచ్చి బఠానీలు - 3/4 కప్పు
బియ్యప్పిండి - 1/2 కప్పు
శెనగ పిండి - 1/2 కప్పు
పసుపు పొడి - 1/4 టీ స్పూన్
పచ్చిమిర్చి - 2
పనీర్ - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1
టమోటా - 1
ఉప్పు, నూనె - తగినంత
తయారీ విధానం
పచ్చి బఠానీలను ఉడకబెట్టి మెత్తగా చేయాలి. టమోటాలు, ఉల్లిపాయలు, బెల్ పెప్పర్లను కట్ చేసి పక్కనబెట్టాలి. పనీర్‌ను తురుముకోవాలి. ఒక గిన్నెలో ముద్దగా చేసిన పచ్చి బఠానీలు వేసి, అందులో బియ్యప్పిండి, శెనగపిండి, పసుపు, ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, పనీర్, ఉప్పు, నీళ్లు పోసి కాస్త చిక్కగా కలపాలి. కట్ లెట్లకు తగినట్లు సిద్దం చేసుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌లా ఫ్లాట్‌గా, కాస్త చిక్కగా చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. తరవాత ఓవెన్‌లో తవా పెట్టి అందులో కొంచెం నూనె వేసి, అందులో కట్‌లెట్‌ని వేసి రెండు వైపులా దోరగా వేపుకోవాలి. అంతే పచ్చ బఠానీ పనీర్ కట్లెట్ రెడీ. దీన్ని టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.