Publish Date: Wed, 19 Nov 2014 (15:15 IST)
Updated Date: Wed, 19 Nov 2014 (15:22 IST)
కావలసిన వస్తువులు:
బియ్యం - కప్పు
గోంగూర - రెండు కట్టలు
ఎండుమిర్చి - 6
శనగపప్పు - టీస్పూను
మినప్పప్పు - టీస్పూను
ఆవాలు - టీస్పూను
జీలకరప్రొడి - రెండు టీస్పూనులు
ధనియాలపొడి - రెండు టీస్పూనులు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - తగినంత
తయారుచేయండి ఇలా :
ముందుగా గోంగూరను వేయించి మిక్సీ పట్టాలి. బియ్యం కడిగి నీరు పోయాలి. పాన్‌లో నూనె వేసి పోపు వేయించి అందులో గోంగూర ముద్ద వేసి బియ్యాన్ని నీటితో సహా పోయాలి. ఉప్పు వేసి పాన్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. వెడల్పయిన పాత్రలో వేసి జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే గోంగూర రైస్ రెడీ.