Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తు ప్రకారం.. వినాయకుడిని ఇంట్లో ఎలా వుంచాలి?

వాస్తు ప్రకారం.. వినాయకుడిని ఇంట్లో ఎలా వుంచాలి?
, బుధవారం, 24 సెప్టెంబరు 2014 (16:22 IST)
వాస్తు ప్రకారం వినాయకుడిని ఇంట్లో ఎలా వుంచాలో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. గణేశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో, చిత్రపటాన్నో కొనడం చేయాలి. గణేశుడి తొండం ఎప్పుడూ గౌరీ (అతని తల్లి)దేవి వైపు అంటే ఎడమ వైపుకి ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
గణేశ వెనుకముఖం మీ ఇంట్లోని ఏ గదుల్లోకి ఎదుర్కొంటున్నట్లుగా ఉంచరాదు. గణేశుడు, సంపదలు, శ్రేయస్సులను అందించే దేవుడు, కాని ఆయన వెనుకముఖం పేదరికాన్ని సూచిస్తుంది. అందువలన, గణేశుడి వెనుకముఖం మీ ఇంటి బయటద్వారం ఎదుర్కొంటున్నట్లుగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 
 
మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. మీ ఇంట్లో తూర్పుదిశలో కాని, పశ్చిమ దిశలోకాని గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. మీ పూజ గది కూడా మీ ఇంట్లో దక్షిణదిశలో ఉండకూడదు. 
 
స్నానాలగదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచకూడదు. మీరు ఉండే గదికి మరియు టాయిలెట్ కి ఉండే సాధారణ గోడ వద్ద కూడా గణేశుని విగ్రహం ఉంచకూడదు.
 
పలు కుటుంబాలు వారి ఇంట్లో స్వచ్ఛమైన వెండి వినాయక విగ్రహం ఉంచుతారు. మీ గణేశ విగ్రహం లోహంతో చేయబడి ఉంటే, అప్పుడు దానిని ఈశాన్యం లేదా నైరుతి దిశలో గాని ఉంచాలి.
 
మెట్ల కింద గణేశవిగ్రహం ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే జనాలు మెట్ల మీద నడుస్తుంటారు అంటే వారు అక్షరాలా గణేశుని తల మీద నడిచినట్లుగా ఉంటుంది. ఇది మీ ఇంటికి దురదృష్టం తీసుకొస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu