Publish Date: Mon, 17 Nov 2014 (17:35 IST)
Updated Date: Mon, 17 Nov 2014 (17:36 IST)
పడమర స్థలములో నివసించే వారు గంభీరమైన హృదయము, నిశ్చిత అభిప్రాయములు గల వారుగా ఉంటారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ వీరి ప్రవర్తన న్యాయబద్ధంగా ఉంటుంది.
సమస్త కార్యములందు వీరికి నేర్పరితనం ఉంటుంది. కార్యసాధన వీరికుంటుంది. తమపై ఉన్న బాధ్యతలను గురించి నిరంతరము ఆలోచిస్తారు. వాక్చాతుర్యంతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు.
ఇతరుల కింద పనిచేయడం వీరికి ఏమాత్రం నచ్చదు. అందుచేత స్వశక్తితో అడుగులేస్తారు. ఉపన్యాసకులుగా రాణిస్తారు. కుటుంబ వృద్ధికి తోడ్పడతారు. తనవారియందు ప్రేమ అధికము. స్వార్థిత సంపదలు, పిత్రార్జిత సంపదలు కలిగివుంటారు.