Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

వాస్తు శాస్త్రం : ఇంట్లో నలుపు, ఎరుపు చీమలు.. వేటితో అదృష్టం..?

Advertiesment
Vastu tips
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (22:15 IST)
నలుపు, ఎరుపు చీమలు ఇంట్లోకి రావడం సాధారణం. అయితే నల్ల చీమలు మనకు హాని చేయవు. ఎర్ర చీమలు కొరికితే శరీరంపై ఎర్రటి పొక్కులు, దురద వంటి అలర్జీలు వస్తాయి. అదేవిధంగా, వాస్తుపరంగా, నలుపు, ఎరుపు చీమలు ఇంట్లోకి రావడం వల్ల ఏర్పడే లాభనష్టాలు తెలుసుకుందాం. మన ఇళ్లలో చాలా రకాల చీమలు ఉంటాయి. వీటిలో కొన్ని చీమలు వస్తే శుభసూచకం, కొన్ని చీమలు వస్తే అశుభం. ఇంట్లో జరిగే శాంతి, సంతోషం, నష్టం, బాధ మొదలైన అనేక విషయాలకు చీమలకు దగ్గరి సంబంధం ఉందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. 
 
ఎరుపు రంగు చీమలు ఇంట్లోకి ప్రవేశించడం దురదృష్టంగా భావిస్తారు. అలాగే నలుపు రంగు చీమలు ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి. నల్ల చీమలు ఇంటి చుట్టూ ఉంటే శుభసూచకం. మీ ఇంటికి సంపద వస్తుందని అర్థం. ఇది మీకు అదృష్టం వస్తుందని సంకేతం. మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే, మీ ఆర్థిక పురోగతికి అడ్డంకులు తొలగిపోతాయి. నల్ల చీమలను అదృష్టం, శాంతికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమ సంచరిస్తుంటే, మీ కుటుంబానికి అదృష్టం, శాంతి మరియు ఆనందం కలగబోతున్నాయని అర్థం. 
 
కానీ మీ ఇంటి లోపల ఎర్రటి చీమలు ఆర్థిక నష్టానికి సంకేతం. నల్ల చీమలకు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ వాడాల్సి వుంటుంది. అలాగే చీమలు ఇంటికి పడమర దిక్కు నుండి వస్తే అది చాలా శుభసూచకం. మీరు విదేశాలకు వెళ్లబోతున్నారని అర్థం. మీరు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీకు అవకాశం వస్తుందని అర్థం. 
 
కానీ మీ ఇంటికి తూర్పు దిక్కు నుండి చీమలు వస్తే అరిష్టం. చీమలు ఆర్థిక స్థితికి సంబంధించినవిగా పరిగణించబడుతున్నందున చెడు వార్తలు సంపద, డబ్బుకు సంబంధించినవి కావచ్చు. 
 
ఉత్తరం వైపు నుండి చీమలు వస్తే మీ ఇంటికి సంతోషం వస్తుందని సంకేతం. ఇది మీ జీవితం మెరుగుపడుతుందని లేదా త్వరలో మీ జీవితంలో సంతోషకరమైనది జరగబోతోందని సూచిస్తుంది. కాబట్టి మీకు సంతోషాన్ని కలిగించే విషయాల కోసం ప్రయత్నిస్తూ ఉండండి. 
 
ఇంటికి దక్షిణం వైపు నుండి చీమలు వస్తే మీకు లాభం చేకూరుతుందని అర్థం. చీమలు గోడపై కింది నుండి పైకి కదులుతూ ఉంటే, మీ జీవితంలో ఎదుగుదల, పురోగతి ఉండబోతుందని అర్థం. అంటే పై నుంచి కిందకు వెళితే కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
నల్ల చీమలు మీ ఇంటిలో బియ్యం కంటైనర్‌లో ఉంటే మంచి సంకేతం. మీకు ధనం రాబోతుందని అర్థం. మీరు మీ వ్యాపారంలో లాభం, పురోగతిని పొందుతారని ఇది సూచిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనం చేతికి అందాలా..? శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చెప్పిన చిన్న మంత్రం..?