వాస్తు ప్రకారం ఈ దిశలో కొవ్వొత్తిని వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇంటికి తూర్పు, ఈశాన్య, దక్షిణ దిశలలో కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఫలితాలు లభిస్తాయి. ఇంకా వాస్తు శాస్త్రంలో కొవ్వొత్తులకు వున్న ప్రాధాన్యతను తెలుసుకుందాం..
చైనీస్ వాస్తులో కొవ్వొత్తులకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల కొవ్వొత్తులు అందుబాటులో ఉన్నాయి. వివిధ స్టైల్స్‌లో రకరకాల రంగుల కొవ్వొత్తులు ఇంట్లో చాలా అందంగా కనిపిస్తాయి. ఇది ఇంటి వాతావరణానికి ఆహ్లాదాన్ని జోడిస్తాయి.
కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటుంది. అవి నెగెటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తాయి. కొవ్వొత్తుల నుండి విడుదలయ్యే శక్తి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, ఇది సానుకూల శక్తిని దానంతటదే పెంచుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
అయితే కొవ్వొత్తులను వెలిగించే స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంటికి తూర్పు, ఈశాన్య దక్షిణ దిశలలో కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా ఆ ఇంట సంతోషం, అభివృద్ధి, శ్రేయస్సు చేకూరుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.