Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తు టిప్స్ 5: సింహద్వారానికి గడప ఉండాలా?

Advertiesment
Vastu tips
, గురువారం, 29 జనవరి 2015 (17:33 IST)
* వాస్తు టిప్స్.. సింహద్వారానికి గడప ఉండి తీరాలి. మిగతా ద్వారాలకు గడపలు లేకపోయినప్పటికీ సింహ ద్వారానికి ఉండి తీరాల్సిందేనని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
* ఇతరుల నుండి వచ్చే నీరు మన ఇంటి ద్వారా బయటికి పోరాదు. మనం ఇంటి నుంచి వీధిలోకి నడిచే నడక అత్యంత ముఖ్యమైనది. ఉచ్ఛస్థానం నుండి మన నడకసాగితే శుభము.
 
* ఇంటికి సింహద్వారం కాక ఇంకొక ద్వారం ద్వారా రాకపోకలకు అవకాశం ఉన్నప్పటికీ,  సింహద్వారాన్నే రాకపోకలకు వాడాలి. 
 
* విద్యార్థులు తూర్పువైపున తల ఉంచి నిద్రించడం ద్వారా విద్యాబుద్ధులు పెరుగుతాయి. ఈశాన్యం తగ్గిన స్థలాలను కొనకూడదు. 
 
* శంకుస్థాపన ఈశాన్య మూలన చెయ్యాలి. గుమ్మాలు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. సరిసంఖ్య అయినప్పటికీ సున్నా రాకూడదు. ఉదాహరణకు, 10, 20 అలా... 
 
* మెట్లు బేసి సంఖ్యలో ఉండేటట్లు నిర్మించాలి. ముఖద్వారానికి ఎదురుగా పొయ్యి ఏర్పాటు చెయ్యరాదు. ఒకే ఇంట్లో మూడు వంటలు చేయకూడదు. 

Share this Story:

Follow Webdunia telugu