Publish Date: Mon, 22 Dec 2014 (17:23 IST)
Updated Date: Mon, 22 Dec 2014 (17:39 IST)
దక్షిణపు గదిలో ఆఫీస్ వుండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణమున కరెంట్ మీటర్లు గానీ, జనరేటర్లు గానీ వుండకూడదు. దక్షిణ ఆగ్నేయములో వుండవచ్చును. దక్షిణభాగములో భూగృహములు నిర్మించుటవలన ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడును.
దక్షిణదిశలో సింహద్వారమునకు ఎదురుగా నిలువువీధి వున్నచో ఇబ్బందులు తప్పవు. దక్షిణదిశలో భోజనశాలవలన అనేక అనారోగ్యములు కలుగుతాయి. దక్షిణదిశలో దక్షిణ అభిముఖముగా వంటచేయరాదు. గృహమునకు కిటికీలు, వెంటిలేటర్లు దక్షిణదిశలో వుండకూడదు.