Publish Date: Sat, 20 Dec 2014 (18:35 IST)
Updated Date: Sat, 20 Dec 2014 (18:56 IST)
ఒక ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహద్వారముగాక ముఖభాగమునందు రెండు ద్వారములుండకూడదు. గృహమునకు మూడుదిశల ఖాళీస్థలముండి నాల్గోదిశయందు లేకుండుట దోషము. అనగా తూర్పు మొదలుకొని ఏదిశ యందలి సరిహద్దు మీద నుంచి అయినను గృహము నిర్మించ రాదు.
పెంకుటిండ్లకు మూడువైపుల మాత్రమే వసారాలు వేయకూడదు. ముందు వెనుకలందుగానీ, నాల్గువైపులాగానీ వేయుట శుభము. డాబా ఇండ్లకు కూడా మూడువైపులా డాబావేసి నాల్గోవైపు పంచదించుట దోషము. అట్లే పెంకుటింటిని డాబాగా మార్పు చేయునప్పుడు మూడువైపుల డాబావేసి నాల్గోవైపు మార్చకుండా ఉండుట దోషము.