Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తు : ఈశాన్య స్థలమున నివసించే వారికి ధనము పెరిగేకొద్ది?

Advertiesment
Vastu
, శుక్రవారం, 18 జులై 2014 (19:36 IST)
వాస్తు ప్రకారం ఈశాన్య స్థలమందు నివసించే వారు మంచి ఆలోచనలు కలిగివుంటారు.  ఉద్రేక స్వభావులు. ఇతరులతో వాక్చాతుర్యత, అందంతో ఆకర్షింపబడుతారు. గృహాలు, వీరు నివసించే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటారు. అందరితో కలిసిమెలసి ఉంటారు. పనులను చురుగ్గా ముగిస్తారు. చలాకీగా ఉంటారు. 
 
అయితే వీరికి ధనము పెరిగేకొద్ది పిసినారి తనము అధికమగును. తాము చేయు కృషి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. తమ బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. దానధర్మముల యందు ఆసక్తి తక్కువ. మానసిక కష్టములున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు.
 
ధనాన్ని ఖర్చు చేయడంలో వెనుకడుగు వేస్తారు. డబ్బును పొదుపు చేయడంలో సమర్థులు. వీరి జీవితంలో కష్ట-సుఖాలు సమానంగా ఉంటాయి. స్వయంకృషితో పైకిరాగలరు. స్థిరచరాస్తులు సంపాదించగలరు. 

Share this Story:

Follow Webdunia telugu