Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంటగది వాస్తు.... ఏయే వస్తువులు ఎక్కడ ఉంచాలి?

వంటగది ఆగ్నేయ మూల ఉండటం మంచిది. ఒకవేళ అలా సాధ్యం కాని సందర్భంలో ఇంటికి వాయువ్య మూలన ఉంచడం మంచిది. వాయవ్యంలో వంటచేయటం వల్ల ఇంట్లో కొంత ఖర్చులు పెరగటానికి ఆస్కారం ఉంది. అయితే వారికి బంధువుల దగ్గర, స్నెహితుల దగ్గర అలాగే సమాజంలో మంచి మంచి గుర్తింపు, కీర్

Advertiesment
వంటగది వాస్తు.... ఏయే వస్తువులు ఎక్కడ ఉంచాలి?
, గురువారం, 5 జనవరి 2017 (16:57 IST)
వంటగది ఆగ్నేయ మూల ఉండటం మంచిది. ఒకవేళ అలా సాధ్యం కాని సందర్భంలో ఇంటికి వాయువ్య మూలన ఉంచడం మంచిది. వాయవ్యంలో వంటచేయటం వల్ల ఇంట్లో కొంత ఖర్చులు పెరగటానికి ఆస్కారం ఉంది. అయితే వారికి బంధువుల దగ్గర, స్నెహితుల దగ్గర అలాగే సమాజంలో మంచి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్ఠలు పెరగటానికి అవకాశం వుంది. వంటగట్టు తూర్పు లేదా ఉత్తర గోడను అంటుకోకుండా చూసుకోవాలి. అలాగే స్టౌ బయటకు కనుపించేలా పెట్టుకోవడం మంచిది కాదు అలాగే స్టౌకు దగ్గరలోనే పంపులు, సింకులు ఉండకుండా చూసుకోవాలి. 
 
అగ్ని, జలం రెండూ పరస్పర విరుద్ధ పదార్థాలు. వంటగదిలో అల్మరాలు ఈశాన్య దిక్కున ఉంటే అందులో తేలికపాటి వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి. అటకలు ఎప్పుడూ వంటగట్టుపై ఉండరాదు. వంటగదిలో పెద్ద కిటికీలు తూర్పు దిక్కున, చిన్నవి దక్షిణ దిక్కున ఉండేలా చూసుకోవాలి. వంటగదికి అనువైన రంగులు ఆకుపచ్చ, లేత గులాబీ, ఆరెంజ్‌. 
 
వంట గదిలో నీళ్ల సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచి ఫలితాలు చేకూరుతాయి. వంటగదిలో నిత్యావసర వస్తువులను వంటకి సంబంధించిన ఇతర సామాగ్రిని పడమర వైపు అలమారాల్లో పెట్టుకోవాలి. మిక్సీలు, గ్రైండర్స్, ఓవెన్, మెదలగు ఎలక్ట్రికల్ వస్తువులను వంటగది దక్షిణం వైపు ఏర్పాటు చెసుకోవాలి. సాధ్యమైనంత వరకు వంటగదిలో రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటుచేయకపోవటం మంచిది, తప్పదు అంటే దక్షిణ- పడమర మూలల్లో గోడలకి తగలకుండా ఉత్తరం వైపు ఫేస్ చేసేట్లు ఏర్పాటు చేసుకోవాలి. 
 
ఇళ్ళలో ముఖ్యంగా అపార్టుమెంట్లలో వంటగదికి ఆనుకుని వున్న వాష్ ఏరియాల్లో, గిన్నెలు కడగటమే కాకుండా, బట్టలు వుతికే వాషింగ్ మిషన్స్ వుంచటం, అక్కడ వాషింగ్ చేయటం అంత మంచిదికాదు. ఆగ్నేయంలో నీటివాడకం ఏంత తక్కువగా వుంటే అంతమంచిది. ఇలాచేయటం వల్ల ఆర్ధిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులమధ్య మనస్ఫర్దలు రావచ్చు, ఆరోగ్యం దెబ్బతినోచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాషింగ్ ఉత్తర దిశవైపు చెసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2017లో 12 రాశులపై శని ప్రభావం... ధనుస్సుకు సంక్షోభాలు తప్పవ్.. మంగళ,శనివారాలు ఏం చేయాలంటే?