Publish Date: Tue, 24 Jun 2014 (17:19 IST)
Updated Date: Tue, 24 Jun 2014 (17:21 IST)
నైరుతి స్థలమందు నివసించే వారికి పని ఎక్కువ-కోరికలు తక్కువట. ఈ స్థలమందు నివశించువారు ధైర్యంతో పాటు ఎక్కువ ఆత్మస్థైర్యాన్ని కలిగివుంటారు. వీరికి క్రమశిక్షణ, జ్ఞాపకశక్తి కలిగివుంటారు. కల్పనాశక్తి, సునిశిత బుద్ధికుశలత, మంచి చెడులను సమానముగా పరిగణించే మనస్తత్వము కలిగివుంటారు.
తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తుండేవారు. వీరికి కోరికలు తక్కువ. ప్రాపంచిక వ్యవహారములందు అభివృద్ధి లోపించియుండును. ఇతరుల ప్రోత్సాహమును అనుసరించి తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. వీరికి బంధువుల వలన కష్టనష్టములు అధికము. తమకున్నదానిని త్యాగము చేసే స్వభావముండుట వలన ఆర్థిక పురోభివృద్ధి కష్టతరమవుతుంది.
శతృవుల వల్ల తరచూ కలిగే ఆటంకములను, బాధలను, మనోనిబ్బరముతో ఎదుర్కొన గలరు. కుటుంబ విషయములందు వీరికి అదృష్టము లోపించి తగిన సుఖశాంతులను అందలేరు. జీవితంలో ఏదో మహత్తర కార్యమును సాధించి తద్వారా ఒక్కసారే ధనికులు కావాలనే వీరి యోచన కార్యరూపము ధరించుట చాలా కష్టము. అందుచేత పొదుపు పాటించండి ద్వారానే వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.