చాలా మంది తమ ఇంట్లో పిల్లిని పెంచుకోవాలని కోరుకుంటారు. కాబట్టి, వాస్తు శాస్త్రం ప్రకారం, పిల్లులకు సంబంధించిన శుభఅశుభ సంకేతాలున్నాయి. వాస్తు శాస్త్రంలో అనేక జంతువులు, పక్షులను శుభప్రదంగా భావిస్తారు. అదే సమయంలో, కొన్నింటిని అశుభమైనవిగా కూడా భావిస్తారు. ఈ విధంగా, వాస్తుశాస్త్రం ప్రకారం, పిల్లుల పెంపకానికి సంబంధించిన శుభఅశుభ సంకేతాలను ప్రస్తావించారు వాస్తు నిపుణులు.
వాస్తు నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. ఇంట్లో పిల్లిని పెంచుకోవడం శుభప్రదం. ఎందుకంటే పిల్లులు తాంత్రిక ప్రభావాన్ని, తాంత్రిక శక్తుల నుంచి మనల్ని రక్షించగలవని నమ్ముతారు. కానీ, కొన్నిసార్లు పిల్లిని పెంచడం దురదృష్టకరం. ఎందుకంటే ఇంట్లో పిల్లి ఉండటం వల్ల రాహువు బలం పెరుగుతుందట. ఇది ఆ వ్యక్తి జీవితంలో సమస్యను పెంచుతుంది.
ఒక పెంపుడు పిల్లి పిల్లి పిల్లలకు జన్మనిస్తే, ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు. పిల్లి శుభకరమైన, అశుభకరమైన స్వభావం దాని రంగుతో ముడిపడి ఉంటుంది. దీని అర్థం మీ ఇంట్లో బంగారు రంగు పిల్లి ఉంటే, అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
అది అదృష్టాన్ని తెస్తుంది. అదే సమయంలో, ఇంట్లో నల్ల పిల్లిని ఉంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా, ఇంట్లో నల్ల పిల్లి ఏడవడం ప్రారంభిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది.