Article Unioun Budget %e0%b0%ac%e0%b0%a1%e0%b1%8d%e0%b0%9c%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d %e0%b0%8e%e0%b0%b2%e0%b0%be %e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf 108022200022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బడ్జెట్' ఎలా వచ్చింది?

Advertiesment
బడ్జెట్ బుజెత్ తోలుతో చేసిన డబ్బు సంచి
ఫ్రెంచి భాషలోని 'బుజెత్' అనే పదం నుంచి బడ్జెట్ పుట్టుకొచ్చింది. బుజెత్ అంటే 'తోలుతో చేసిన డబ్బు సంచి' అని అర్థం. ప్రభుత్వం పుణ్యమా అని ఇంటి వ్యవహారాల్లో కూడా బడ్జెట్ పదం విరివిగా వాడుకలో ఉంటోంది. కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో బడ్జెట్ పదం ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చిందనేది చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. తొలిసారి బడ్జెట్ పదప్రయోగం వెనుక ఆసక్తికరమైన వృత్తాంతం ఒకటి ప్రచారంలో ఉంది. ఈ వృత్తాంతంలో ఇంగ్లాండ్ మాజీ ఆర్థిక మంత్రి సర్ రాబర్ట్ వాల్‌పోల్ ప్రధాన పాత్ర పోషించారు.

ఈ వృత్తాంతం 1733 నాటిది. ఆర్థిక అంశాలను ప్రస్తావించే పత్రాలను ఒక తోలు సంచిలో పెట్టుకుని సర్ రాబర్ట్ వాల్‌పోల్ పార్లమెంటుకు విచ్చేసారు. పత్రాల వివరాలను పార్లమెంటు ఎదుట నివేదించే నిమిత్తం ఆయన ఆ తోలు సంచిని తెరిచారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు 'బడ్జెట్ తెరిచారు' అంటూ ఆర్థిక మంత్రి సర్ రాబర్ట్ వాల్‌పోల్‌ను ఆటపట్టిస్తున్నట్లుగా ఒక పత్రిక వార్తను ప్రచురించింది. ఆ నాటి నుంచి ప్రభుత్వ వార్షిక ఆదాయ వ్యయాలను అంచనా వేసే వ్యవహారానికి బడ్జెట్ పదం వాడుకలోకి వచ్చింది. అలా బ్రిటన్‌లోని అన్ని ప్రాంతాలలో బడ్జెట్ పదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది.

Share this Story:

Follow Webdunia telugu