Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకులతో పోస్టాఫీసుల అనుసంధానం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Advertiesment
budget 2022
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:58 IST)
దేశంలోని పోస్టాఫీసులను బ్యాంకులతో అనుసంధానం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మంగళవారం లోక్‌సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోని నదులైన గోదావరి - కృష్ణా - పెన్నేరు - కావేరి నదులను అనుసంధానం చేసేలా ఒక ప్రాజెక్టును రూపకల్పన చేస్తామన్నారు. ఆమె లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
భూమి పత్రాలన్నీ డిజిటలైజేషన్. ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రీ పేరుతో ప్లాన్ 
1.5 లక్షల పోస్టాఫీసుల్లో డిజిటల్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ విధానం. 
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక కేంద్రాల్లో బ్యాటరీలను మార్చేందుకు ప్రణాళికలు.
వ్యవసాయ వస్తువుల కనీస మద్దతు ధర కోసం రూ.2.7 లక్షల కోట్లు
బ్యాంకుల సహకారంతో పోస్టాఫీసు నిర్వహణకు చర్యలు
ఈశాన్య రాష్ట్ర అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయింపు 
ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం కింద 18 లక్షల ఇళ్లు నిర్మించేందుకు రూ.48 వేల కోట్లు కేటాయింపు
రూ.60 వేల కోట్లతో 18 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు
దేశవ్యాప్తంగా 2 లక్షల అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేయనున్నారు
 
2023 నాటికి 2 వేల కి.మీ. దూరం వరకు రైల్వే నిర్మాణం అభివృద్ధి చెందుతుంది. 
దేశవ్యాప్తంగా 25,000 కి.మీ జాతీయ రహదారి. దూరం వరకు విస్తరించబడింది.
నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తాం. 
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తం. 
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు దృష్టి సారిస్తాం.
వందే భారత్ ప్రాజెక్టు కింద మూడేళ్లలో 400 రైళ్లను ప్రవేశపెడతాం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు నిర్మాణ సౌకర్యాలు 22,000 కి.మీలకు విస్తరిస్తాం.
44 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. 
 
యువత వ్యాపారాలు ప్రారంభించడానికి బడ్జెట్‌పై దృష్టి పెట్టాం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు నిర్మాణ సౌకర్యాలు 22,000 కి.మీలకు విస్తరిస్తాం. 
వందే భారత్ ప్రాజెక్టు కింద మూడేళ్లలో 400 రైళ్లను ప్రవేశపెడతాం. 
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు దృష్టి సారిస్తాం. 
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. 
2022-02-01 భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. 
 
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా ఉంటుందని అంచనా. 
రాబోయే 25 ఏళ్ల వృద్ధికి పునాది వేసేందుకు ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. 
కరోనా మహమ్మారి తర్వాత వేగంగా కోలుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. 
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఆమె అభివర్ణించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహితను లొంగదీసుకున్న యువకుడు, పెళ్లాడమంటే వీడియోలు బయటపెట్టాడు