Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యుత్‌తో నడిచే తొలి విమాన గగన విహారం సక్సెస్!

Alice Electric Plane
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (13:22 IST)
ప్రపంచం పర్యావరణ రహిత ఇంధన వినియోగంపై దృష్టిసారించింది. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీ కోసం అనేక అనేక ఆటోమొబైల్ కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయ. ఇప్పటికే విద్యుత్ ఆధారిత వాహనాలను తయారు చేస్తూ భవిష్యత్‌లో స్వచ్ఛమైన వాతావరణానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలు ఇలా విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాలే కాదు గాల్లో రయ్‌మంటూ దూసుకెళ్లే విమానాలను కూడా తయారు చేస్తున్నాయి. 
 
ప్రపంచంలోనే తొలిసారి ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి చక్కర్లు కొట్టింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 8 నిమిషాల పాటు గగన విహారం చేసింది. 3500 అడుగుల ఎత్తులో దీన్ని విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే విమానం. దీనికి "ఆలిస్" అని పేరు పెట్టారు. 
 
దీన్ని ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ తయారు చేసింది. ఇది గరిష్టంగా 200 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. తేలికపాటి జెట్ విమానాలు, హైఎండ్ టర్బోప్రాస్ విమానాల ఖర్చుతో పోల్చితే ఆలిస్ ప్రయాణానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని తయారీ కంపెనీ చెబుతోంది. 
 
ఈ ఆలిస్ విమానంలో ఆరు సీట్లతో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, 9 సీట్లతో కమ్యూటర్, ఈ కార్గో పేరిట మూడు వేరియంట్లు ఉన్నాయి. ఆలిస్ అన్ని మోడళ్లలో ఇద్దరు పైలెట్లు ఉంచుతారు. ఈ ఆలిస్ కోసం ఇప్పటికే అనేక కంపెనీలు ఆర్డర్లు వేయడం గమనార్హం. ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్ఎల్ కూడా తమ సరకు రవాణా కోసం 12 ఆలిస్ ఈ కార్గో రకం విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. అలాగే, అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబర్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా పదుల సంఖ్యలో ఈ విమానాల కోసం ఆర్డర్లు బుక్ చేశాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పూనమ్ కౌర్ ఏం చెప్పిందంటే?