Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం: కల్లు గ్లాసుతో సింగర్ సునీత (video)

Advertiesment
ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం: కల్లు గ్లాసుతో సింగర్ సునీత (video)
, శుక్రవారం, 5 మార్చి 2021 (14:55 IST)
సింగర్ సునీత. ఇటీవలే పారిశ్రామికవేత్త రామ్ వీపనేనిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమ పెళ్లి గురించి, రామ్ ప్రపోజ్ చేసిన విషయం గురించి మీడియాలో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సునీతను ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియా ఛానల్ వారు ప్రత్యేక కార్యక్రమం కోసం ఆహ్వానించారట.
 
ఈ కార్యక్రమం ప్రగతి రిసార్టులో జరిగింది. అక్కడ తాటిచెట్లు బాగా ఎక్కువగా వుంటాయి. వేసవి కావడంతో గీత కార్మికులు తాటి కల్లును తీసి అమ్ముతుంటారు. ఈ క్రమంలో సింగర్ సునీత పాల్గొంటున్న షో దగ్గరకి కొందరు గీత కార్మికులు తాజా కల్లును తీసుకుని వచ్చారట.
 
ఆ కల్లును చూడగానే తోటి కళాకారులు కొందరు సిప్ చేస్తూ ఎంజాయ్ చేసినట్లు సమాచారం. పనిలో పనిగా సింగర్ సునీతకు కూడా ఓ గ్లాసు కల్లు ఇచ్చారట. మరి ఆమె వాటిని తాగారో లేదో కానీ కల్లు గ్లాసుతో వున్నట్లు ఫోటోల్లో కనబడ్డారు. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లెట్ రైలుకు గుజరాత్ మాత్రమే అర్హత ఉందా?