Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడవే ఇల్లు.. అదే అతని హోం క్వారంటైన్.. ఎక్కడ?

Advertiesment
West Bengal
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:31 IST)
దేశాన్ని కరోనా వైరస్ చుట్టిముట్టింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో దేశ ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే, ఓ వృద్ధుడు మాత్రం విధిలేని పరిస్థితుల్లో సరికొత్తగా ఆలోచన చేశాడు. ఫలితంగా ఇపుడు దేశ ప్రజలే కాదు.. ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాని నబద్వీప్ ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తి నదిలోని బోటునే తన నివాసంగా చేసుకుని క్వారంటైన్‌గా ఉపయోగిస్తున్నాడు. తన బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ నుంచి సొంతూరికి వెళ్లాక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్థలు తనను గ్రామంలోకి రానివ్వలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆ తర్వాత తనకు ఓ ఆలోచన వచ్చింది. తన బోటునే క్వారంటైన్‌గా మార్చుకుని అక్కడే ఉంటున్నట్టు చెప్పుకొచ్చాడు.
webdunia
 
ఈ విషయం తెలుసుకున్న మీడియా అతన్ని పలుకరించగా, హబీబ్‌పూర్‌లోని ఓ బంధువు ఇంటికి వెళ్లొచ్చాక నాకు జ్వరం వచ్చింది. అయితే ఆ తర్వాత మా గ్రామస్తులు నన్ను ఊళ్లోకి రానివ్వలేదు. డాక్టర్‌ నాకు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇక చేసేదేమి లేక బోటులోనే షెల్టర్‌ వేసుకుని ఉంటున్నట్లు చెప్పాడు. సదరు వ్యక్తి బోటులో ఉండి.. అక్కడే బస చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య సామాగ్రీ తయారీ చేస్తున్న పరిశ్రమలు, ఉద్యోగులకు ఆటంకం రానివ్వం : మంత్రి మేకపాటి